Tadepalligudem Meeting: తాడేపల్లిగూడెం సభ నిర్వహణకు టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు

TDP and Janasena forms Coordination Committee for Tadepalligudem meeting

  • ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ
  • పొత్తు నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ, జనసేన
  • సభ విజయవంతం కోసం 10 మంది సభ్యులతో సమన్వయ కమిటీ 

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కూటమి భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ  సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. 

ఈ సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు, బీజేపీతో పొత్తుపైనా ప్రకటన చేసే అవకాశాలున్నట్టు  తెలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తాడేపల్లిగూడెం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాయి. ఇందులో 10 మంది సభ్యులు ఉన్నారు. 

ఈ కమిటీలో టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, ఎంవీ సత్యనారాయణరాజు... జనసేన నుంచి కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేశ్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చాగంటి మురళీకృష్ణ, రత్నం అయ్యప్ప సభ్యులుగా ఉన్నారు.

More Telugu News