Vyuham: 'వ్యూహం' సినిమా విడుదల వాయిదా

Vyuham release postponed

  • వర్మ దర్శకత్వంలో పొలిటికల్ చిత్రం
  • ఫిబ్రవరి 23న విడుదలవ్వాల్సిన చిత్రం
  • మార్చి 1కి వాయిదా
  • మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రం మార్చి 8న విడుదల

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ చిత్రం వ్యూహం విడుదల వాయిదా పడింది. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నట్టు వర్మ నేడు వెల్లడించారు. ఇటీవల అడ్డంకులు తొలగిపోవడంతో వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నామంటూ వర్మ ఆట్టహాసంగా ప్రకటించారు. 

కానీ విడుదలపై ఇవాళ సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. వ్యూహం చిత్రాన్ని మార్చి 1న విడుదల చేస్తున్నామని, అదే సమయంలో మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రాన్ని మార్చి 8న విడుదల చేస్తున్నామని వర్మ వివరించారు. 

అయితే ఈసారి తమ చిత్రాలు వాయిదా పడింది లోకేశ్ కారణంగా కాదని వెల్లడించారు. కొన్ని సాంకేతిక కారణాలు, మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం కోసం, మేం కోరుకున్న థియేటర్లలో విడుదల చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వర్మ ట్వీట్ చేశారు.

Vyuham
Release
Postpone
Ram Gopal Varma
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News