Ganta Srinivasa Rao: ఏ సీటు ఎవరికో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మాత్రమే తెలుసు: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao talks about seat sharing

  • ఏపీలో త్వరలో ఎన్నికలు
  • టీడీపీ, జనసేన మధ్య పొత్తు 
  • ఇంకా ఓ కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు
  • బీజేపీ కూడా పొత్తులో చేరితే అప్పుడు ప్రకటన ఉంటుందన్న గంటా!

ఏపీలో టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో, పొత్తు-సీట్ల సర్దుబాటుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. 

టీడీపీ, జనసేన మధ్య మెజారిటీ స్థానాల్లో ఇప్పటికే స్పష్టత వచ్చిందని, బీజేపీ కూడా పొత్తులో చేరే అవకాశం ఉంది కాబట్టి సర్దుబాటుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే సీట్ల పంపకంపై ప్రకటన రావొచ్చని గంటా అభిప్రాయపడ్డారు. 

అయితే, ఏ సీటు ఎవరికన్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు తప్ప మూడో వ్యక్తికి తెలియదని స్పష్టం చేశారు. భీమిలి కావొచ్చు, అనకాపల్లి కావొచ్చు, గాజువాక కావొచ్చు, చోడవరం కావొచ్చు... లేకపోతే మరొకటైనా కావొచ్చు... ఇవన్నీ జనసేనకు వస్తాయా, లేక టీడీపీకి వస్తాయా అన్నది చంద్రబాబు, పవన్ లకు మాత్రమే తెలుసని అన్నారు.

Ganta Srinivasa Rao
TDP
Janasena
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News