Allu Arjun: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'పుష్ప' స్పెషల్ స్క్రీనింగ్... ఫొటోలు ఇవిగో!
![Allu Arjun attends Pushpa special screening in Berlin Film Festival](https://imgd.ap7am.com/thumbnail/cr-20240218tn65d1cbf09cecb.jpg)
- జర్మనీలో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్
- ప్రత్యేక ఆహ్వానితుడిగా బెర్లిన్ వెళ్లిన అల్లు అర్జున్
- పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరు
- అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి
రెండేళ్ల కిందట వచ్చిన పుష్ప చిత్రం ఇప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సందడి చేస్తోంది. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ పుష్ప కోలాహలం నెలకొంది. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో సెల్ఫీలు తీసుకునేందుకు, కరచాలనం చేసేందుకు అక్కడి వారు పోటీలు పడ్డారు. అంతేకాదు, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా అల్లు అర్జున్ అంతర్జాతీయ మీడియాతోనూ ముచ్చటించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240218fr65d1cbba3fda3.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240218fr65d1cbc44f309.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240218fr65d1cbd3b5d16.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240218fr65d1cbdf1cc96.jpg)