Revanth Reddy: అసెంబ్లీలో కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy greetings to KCR

  • కాంగ్రెస్ తరపున కేసీఆర్ కు గ్రీటింగ్స్ తెలిపిన రేవంత్
  • మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆకాంక్ష
  • ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని విన్నపం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. నీటిపారుదల రంగంపై శ్వేత పత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేతగా సభను సజావుగా నడపడానికి ఆయనకు పూర్తి స్థాయిలో శక్తిని కల్పించాలని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన వచ్చి వివిధ అంశాలపై సలహాలు ఇవ్వాలని అన్నారు.

Revanth Reddy
Congress
KCR
BRS
Birthday
TS Politics
  • Loading...

More Telugu News