Budda Venkanna: 'కుర్చీ'పై మేం కూడా అదే చెబుతున్నాం అంబటీ!: బుద్ధా వెంకన్న

Buddha Venkanna counters Ambati Rambabu remarks

  • మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతామన్న లోకేశ్
  • ఇక్కడున్నది సింహాసనం అంటూ అంబటి కౌంటర్
  • సింహాసనం అయితే దాని మీదున్న శునకాన్ని తరిమేస్తామన్న బుద్ధా

మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతాం అంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడున్నది సింహాసనం... కుర్చీ కాదు మడతపెట్టడానికి... అంటూ అంబటి బదులిచ్చారు. 

ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న స్పందించారు. "మేం కూడా అదే చెబుతున్నాం అంబటీ... కుర్చీ అయితే మడతపెడతాం... సింహాసనం అయితే... దాని మీదున్న శునకాన్ని తరిమేస్తాం... ఇది ఓకేనా?" అంటూ బుద్ధా చురక అంటించారు. వైసీపీ పనైపోయిందంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

Budda Venkanna
Ambati Rambabu
Chair
Nara Lokesh
Jagan
TDP
YSRCP
  • Loading...

More Telugu News