Janasena: అధికార యంత్రాంగం కూడా అక్రమాలపై మౌనంగా ఉండడం బాధాకరం: పవన్ కల్యాణ్

Janasena chief Pawan Kalyan fires on YSRCP govt for irregularities in Andhrapradesh

  • రాష్ట్రంలో ఇసుక తవ్వకంతో పాటు ఇతర అక్రమాలకు అడ్డుకట్టవేయడం లేదని జనసేనాని మండిపాటు
  • అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు కూడా బాధ్యులవుతారని హెచ్చరిక
  • జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలకు ఇసుక అక్రమాలపై అవగాహన కల్పించిన పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ఇసుక తవ్వకంతో పాటు ఇతర అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా అధికార యంత్రాంగం కూడా మౌనంగా ఉండిపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్రమాలకు సంబంధించిన కేసుల్లో అధికారులు కూడా బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి రాగానే ఇసుక దోపిడీ కోసం భవన నిర్మాణ కార్మికులను వైసీపీ నేతలు రోడ్డున పడేశారని పవన్ ఆరోపించారు. వైసీపీ పాలకులకు ప్రజా క్షేమం ఏనాడూ పట్టలేదన్నారు. విలేకరి పరమేశ్వరరావుపై దాడి అప్రజాస్వామికమని పవన్ కల్యాణ్ ఖండించారు. ఈ దాడిని అందరూ ఖండించాలని ఆయన అన్నారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, గనుల అక్రమార్జనతో వైసీపీ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోందని విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో పర్యావరణాన్ని చెరపట్టి ఇసుకను దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకం కారణంగా గుంతలు ఏర్పడ్డాయని, ఆ గుంతల్లో పడి సుమారు 26 మంది మృత్యువాతపడ్డారని పవన్ ఆరోపించారు. ఈ మేరకు ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు, నదీ తీరంలో యంత్రాలతో ఇసుక దోపిడీపై నేతలకు పవన్‌ అవగాహన కల్పించారు.

  • Loading...

More Telugu News