Gowthami: అన్నాడీఎంకే పార్టీలో చేరిన సినీ నటి గౌతమి

Actress Gowthami joins AIADMK

  • 25 ఏళ్లుగా బీజేపీలో ఉన్న గౌతమి
  • కష్ట కాలంలో తనకు మద్దతు లభించలేదని ఆవేదన
  • పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకేలో చేరిన గౌతమి

లోక్ సభకు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో దాదాపు 25 ఏళ్ల పాటు ఉన్న గౌతమి ఇప్పుడు అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం. 

ఇంతకు ముందే బీజేపీపై గౌతమి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేశానని... కానీ, కష్ట కాలంలో తనకు తగిన మద్దతు లభించలేదని ఇంతకు ముందు ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో... ఈరోజు పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే తమిళ సినీ నటి గాయత్రి రఘురాం కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి అన్నాడీఎంకేలో చేరారు.  

Gowthami
Kollywood
Tollywood
BJP
AIADMK
  • Loading...

More Telugu News