Uttam Kumar Reddy: కేసీఆర్ అనుభవజ్ఞుడు... మేం ఆయనలా కాదు.. అందుకే సలహా అడుగుతున్నాం!: ఉత్తమ్ కుమార్ రెడ్డి చురక

Uttam Kumar Reddy satire on KCR

  • మేడిగడ్డ, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి
  • మేడిగడ్డ పగుళ్ల ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
  • కాళేశ్వరం ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచారని విమర్శ

కేసీఆర్ అన్ని విషయాల్లోనూ అనుభవజ్ఞుడని... మేం ఆయనలా కాదని, అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహాను అడుగుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చురక అంటించారు. మేడిగడ్డ, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి తెలిపారు. బుధవారం ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము కేసీఆర్‌లా అనుభవజ్ఞులం కాదని ఎద్దేవా చేశారు. అందుకే డ్యామ్ సేఫ్టీ అథారిటీని సలహా అడుగుతున్నామన్నారు.

మేడిగడ్డ పగుళ్ల ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచారని విమర్శించారు. షార్ట్ టైమ్... హైఇంట్రెస్ట్‌తో అప్పులు తెచ్చారని ఆరోపించారు. గతంలో పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ మీద విచారణ చేయిస్తామని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ అధినేత వస్తామని చెబితే స్వాగతిస్తామన్నారు.

Uttam Kumar Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News