Jagan: విశాఖలో 'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకలకు హాజరైన సీఎం జగన్
![CM Jagan attends Adudam Andhra final day ceremony](https://imgd.ap7am.com/thumbnail/cr-20240213tn65cb96ef870c4.jpg)
- డిసెంబరు 26 నుంచి ఏపీలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు
- నేడు విశాఖలో వివిధ క్రీడాంశాల్లో ఫైనల్స్
- విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం జగన్
ఏపీలో డిసెంబరు 26 నుంచి జరిగిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. వివిధ క్రీడాంశాల్లో ఫైనల్స్ విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు అందించారు. విజేతలను అభినందించారు. కాగా, ముగింపు వేడుకల నేపథ్యంలో స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్, బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు రోజా, విడదల రజని కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.
![](https://img.ap7am.com/froala-uploads/20240213fr65cb962be4b25.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240213fr65cb963826fd3.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240213fr65cb964535074.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240213fr65cb96518c59d.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240213fr65cb965d81d58.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240213fr65cb966aa5ce0.jpg)