Upasana: క్లీంకారకు ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్లు... ఆసక్తికర ఫొటో పంచుకున్న ఉపాసన

Upasana shares interesting pic in social media

  • 2021లో అర్మాన్ ఇబ్రహీంను పెళ్లాడిన ఉపాసన సోదరి అనుష్పాల
  • జనవరి 23న పండంటి కవలలకు జన్మనిచ్చిన అనుష్పాల
  • బారసాల కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్, ఉపాసన

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గతేడాది జూన్ లో పండంటి పాప జన్మించగా, క్లీంకార అని నామకరణం చేయడం తెలిసిందే. పాప ఎలా ఉంటుందన్న ఆసక్తి మెగా అభిమానుల్లో అంతకంతకు పెరిగిపోతున్నా గానీ... చరణ్-ఉపాసన దంపతులు ఇప్పటివరకు క్లీంకార ముఖాన్ని చూపించలేదు. 

ఇక అసలు విషయానికొస్తే... ఉపాసన సోషల్ మీడియాలో ఆసక్తిర ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో ఉపాసనతో పాటు క్లీంకారను ఎత్తుకున్న రామ్ చరణ్... ఉపాసన సోదరి అనుష్పాల కామిని, ఆమె భర్త అర్మాన్ ఇబ్రహీం కూడా ఉన్నారు. అంతేకాదు, అనుష్పాల చేతిలో ఒక బిడ్డ, ఆమె భర్త చేతిలో మరొక బిడ్డ ఉండడాన్ని చూడొచ్చు. 

ఈ ఫొటోపై ఉపాసన ఆసక్తికరంగా స్పందించారు. "అద్భుతమైన ముగ్గురు చిన్నారి బాలికలను పరిచయం చేస్తున్నాం. క్లీంకార కొణిదెల ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లు ఐరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరిత ఇబ్రహీంలను కలుసుకుంది" అని ట్వీట్ చేశారు. 

అనుష్పాల, ప్రముఖ కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంల వివాహం 2021లో జరిగింది. ఈ ఏడాది జనవరి 23న అనుష్పాల పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఘనంగా నిర్వహించిన బారసాల కార్యక్రమానికి ఉపాసన, రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోనే ఉపాసన తాజాగా పంచుకున్నారు.

Upasana
Klin Kaara
Sisters
Anushpala
Arman Ibrahim
Hyderabad
Tollywood

More Telugu News