Allu Arjun: అల్లు అర్జున్ కు గాయమైందా?

Allu Arjun reportedly injured in shooting

  • ఎడమ చేతికి బ్యాండేజితో అల్లు అర్జున్
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్
  • అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే, అల్లు అర్జున్ చేతికి బ్యాండేజ్ తో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన చేతికి ఏమైంది? గాయమైందా? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అల్లు అర్జున్ చేతికి దెబ్బ తగలడం నిజమేనని, కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఎడమ చేతికి తేలికపాటి గాయమైందని తెలుస్తోంది. డాక్టర్ల సలహా మేరకు రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న అల్లు అర్జున్... గాయం నయం అయ్యాక మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. దాంతో అభిమానులు కుదుటపడ్డారు.

More Telugu News