KCR: టీఎస్ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు

KCR not came to Assembly

  • నందినగర్ లోని తన నివాసంలోనే ఉన్న కేసీఆర్
  • ఈ నెల 13న నల్గొండలో నిర్వహించే సభ ఏర్పాట్లపై సమీక్ష జరుపుతున్న కేసీఆర్
  • ఇంతవరకు శాసనసభలో అడుగు పెట్టని మాజీ సీఎం

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. 

అయితే, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి కానీ, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. ఈరోజు బడ్జెట్ సందర్భంగానైనా ఆయన వస్తారని భావించినప్పటికీ... ఆయన రావడం లేదనే సమాచారం అందింది. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగసభ ఏర్పాట్లపై కీలక నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్, నంది నగర్ లోని తన నివాసంలోనే ఉన్నారు.

KCR
BRS
TS Assembly
Budget Session
TS Politics
  • Loading...

More Telugu News