Janhvi Kapoor: అప్సరసలు అసూయపడే అందం .. జాన్వీ కపూర్ సొంతం.. లేటెస్ట్ పిక్స్

Janhvi Kapoor Special

  • బాలీవుడ్ బ్యూటీ అనిపించుకున్న జాన్వీ 
  • సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ 
  • ఆమె గ్లామర్ కి ఫిదా అవుతున్న కుర్రకారు 
  • తెలుగులో ఆమె ఫస్టు మూవీగా రానున్న 'దేవర'


జాన్వీ కపూర్ .. బాలీవుడ్ యంగ్ హీరోయిన్. అక్కడి కుర్రాళ్ల చూపులన్నీ తన చుట్టూ తిప్పుకుంటున్న బ్యూటీ. హిందీలో ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాలు .. అందువలన వచ్చిన క్రేజ్ తక్కువనే. కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె పెంచుకున్న ఫాలోయింగే ఎక్కువ. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఆమె మత్తెక్కిస్తూనే ఉంది. తాజాగా ఆమె నుంచి వచ్చిన హాట్ పిక్స్ అభిమానులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పాలరాతి శిల్పంలా .. గులాబీ రేకులను గుమ్మరించి చేసిన శిల్పంలా ఆమె కనిపిస్తోంది. సౌందర్యమంటే ఇది .. మత్తు కళ్లు ఒలికించే మాధుర్యమంటే ఇది అన్నట్టుగా అనిపిస్తోంది. సొగసుల జలపాతాన్ని తలపించే ఈ సౌందర్యాన్ని రెండు కళ్లతో ఆస్వాదించడం అసాధ్యమే. ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులు చేతిలో ఉన్న ఈ సుందరి, తెలుగులో 'దేవర' సినిమా చేస్తోంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె కథాకాయికగా అలరించనుంది. ఇక మరో వైపున చరణ్ 16వ సినిమాలోను ఆమెనే హీరోయిన్ అనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. చూస్తుంటే టాలీవుడ్ లో ఈ బ్యూటీ బిజీ అయ్యేలానే కనిపిస్తోంది. 

Janhvi Kapoor
Actress
Jr NTR
Koratala Siva
  • Loading...

More Telugu News