Steve Harmison: వైజాగ్ బీచ్ ను ఇంగ్లండ్ క్రికెటర్ ప్రశంసించాడు: వైసీపీ

YSRCP shares English former pacer Steve Harmison
  • విశాఖలో టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు
  • నగరానికి భారీగా తరలి వచ్చిన ఇంగ్లండ్ అభిమానులు
  • విశాఖ ఆర్కే బీచ్ ను సందర్శించిన మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్
విశాఖలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్టును వీక్షించేందుకు ఇంగ్లండ్ అభిమానులు పెద్ద సంఖ్యలో వైజాగ్ తరలివచ్చారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ ను చూసేందుకు వచ్చారు. వారిలో ఇంగ్లండ్ మాజీ పేస్ స్టీవ్ హార్మిసన్ కూడా ఉన్నాడు. హార్మిసన్ వైజాగ్ వచ్చిన సందర్భంగా ఇక్కడి సుప్రసిద్ధ ఆర్కే బీచ్ ను సందర్శించాడు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన బీచ్ అని కితాబునిచ్చాడు. అంతేకాదు, ఇక్కడ బీచ్ ను యంత్రాలతో శుభ్రం చేసే పద్ధతి నచ్చిందని వెల్లడించాడు. ఈ మేరకు ఏపీ అధికార పక్షం వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. హార్మిసన్ వ్యాఖ్యల వీడియోను కూడా వైసీపీ ట్వీట్ చేసింది.
Steve Harmison
RK Beach
Visakhapatnam
YSRCP
Team India
England
Test

More Telugu News