Guntur karam: ఓటీటీలోకి గుంటూరు కారం మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..!

Mahesh Babu Guntur Karam movie In OTT From Feb 9
  • ఈ నెల 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనల్ లో వచ్చిన లేటెస్ట్ హిట్
  • థియేటర్లలో మిక్స్ డ్ టాక్.. రూ.215 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 9 నుంచి ప్రసారం కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. అయితే, మిక్స్ డ్ టాక్ రావడంతో థియేటర్లకు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. 

మొదటి రోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. లాంగ్ రన్ లో మొత్తం రూ.215 కోట్లు కలెక్ట్ చేసింది. థియేటర్ దాకా వెళ్లి చూడని ప్రేక్షకులు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఈ నెల 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Guntur karam
OTT Release
Netflix
Mahesh Babu
Sri leela

More Telugu News