Atchannaidu: దెందులూరు సభలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే: అచ్చెన్నాయుడు

Atchannaidu counters CM Jagan remarks

  • దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్ విమర్శలు
  • సీఎం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన అచ్చెన్నాయుడు
  • అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని విమర్శలు
  • జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడు అంటూ వ్యాఖ్యలు 

సీఎం జగన్ దెందులూరు సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. దెందులూరు సభలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రజా సునామీలో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. 

57 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మాపై నిందలు వేస్తారా? అని మండిపడ్డారు. వైసీపీ పాలనలో పన్నులు, చార్జీల పెంపుతో ప్రతి కుటుంబంపై రూ.8 లక్షల భారం పడుతోందని అచ్చెన్నాయుడు వివరించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతిని చంపేశారని ధ్వజమెత్తారు. 

తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ మహిళా పక్షపాతా? అని నిలదీశారు. అబద్ధాల పునాదుల మీద జగన్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. జగన్ తాను అర్జునుడ్ని అని చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఆయన భస్మాసురుడు అని ఎద్దేవా చేశారు. యుద్ధానికి ముందే జగన్ ఓటమిని ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు.

Atchannaidu
Jagan
Denduluru
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News