YS Sunitha: నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత

I am receiving death threats says YS Sunitha

  • సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారన్న సునీత
  • హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
  • చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని విన్నపం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్ బుక్ వేదికగా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. లేపేస్తాం అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ, సునీత తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

YS Sunitha
YS Vivekananda Reddy
Cybercrime
Hyderabad
Death Threat
  • Loading...

More Telugu News