Heeramandi: వేశ్యల నేపథ్యంలో సంజల్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ .. 'హీరామండి'

Heeramandi web series update

  • సంజయ్ లీలా భన్సాలీ నుంచి వెబ్ సిరీస్ 
  • 'హీరామండి .. ది డైమండ్ బజార్' అనేది టైటిల్ 
  • ప్రధాన తారాగణంగా కనిపించనున్న క్రేజీ స్టార్స్
  • స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్న నెట్ ఫ్లిక్స్  


బాలీవుడ్ దర్శకులలో సంజయ్ లీలా భన్సాలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన దేవదాస్ .. గంగూబాయి కథియావాడి .. బాజీరావ్ మస్తానీ .. రామ్ లీల వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాంటి భన్సాలీ ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా తన జోరు చూపించడానికి సిద్ధమవుతున్నాడు. 

ఆయన దర్శక నిర్మాణంలో ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది .. ఆ వెబ్ సిరీస్ పేరే 'హీరామండి ది డైమండ్ బజార్'. పాకిస్థాన్ - లాహోర్ ప్రాంతంలో ఒకప్పటి వేశ్యల జీవితాలు ఎలా ఉండేవి? అనే నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. త్వరలోనే ఇది 'నెట్ ఫ్లిక్స్' ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. 

భన్సాలీ రూపొందించిన ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా .. సోనాక్షి సిన్హా .. అదితిరావు హైదరి .. రిచా చద్దా .. షర్మిన్ సైగల్ ప్రధానమైన పాత్రలను పోషించారు. రీసెంటుగా రిలీజ్ చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారనే విషయం అర్థమవుతోంది. నెట్ ఫ్లిక్స్ వారు త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించనున్నారు.

Heeramandi
Manisha Koirala
Sonakshi Sinha
Adithi Rao
  • Loading...

More Telugu News