Ashika ranganath: అందాల రాజహంసలా ఆషిక రంగనాథ్ .. లేటెస్ట్ పిక్స్!

Ashika Ranganath Special

  • 'అమిగోస్' ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ
  • 'నా సామిరంగ'తో పడిన తొలి హిట్
  • వరుసబెడుతున్న భారీ ఆఫర్లు  


టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ భామల జోరు కొనసాగుతోంది. ఒకప్పుడు తమిళ .. మలయాళ బ్యూటీల సందడి ఇక్కడ ఎక్కువగా కనిపించేది. కానీ ఇటీవల కాలంలో కన్నడ సుందరీమణుల హవా నడుస్తోంది. అలా కన్నడ సినిమాల నుంచి టాలీవుడ్ వైపు వచ్చిన బ్యూటీగా ఆషిక రంగనాథ్ కనిపిస్తుంది. 2016లో 'క్రేజ్ బాయ్'తో అక్కడ ఆమె ఎంట్రీ ఇచ్చింది. 'పట్టాతు అరసన్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషిక, 'అమిగోస్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ జోడీగా ఈ సినిమాలో ఆమె అలరించింది. ఆశించినస్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. యూత్ లో ఆమెకి పెరిగిన క్రేజ్ కారణంగానే 'నా సాంమిరంగ' సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది. 'నా సామిరంగ' సినిమా సక్సెస్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయని వినికిడి. తాజాగా ఆమె నుంచి వచ్చిన ఆమె పిక్స్ కుర్రకారు మనసులను కొల్లగొట్టేసేలా ఉన్నాయి. తెల్లని చీరకట్టులో ఆమె అందాల రాజహంసను గుర్తుచేస్తోంది. వెన్నెల్లో చందమామను తలపిస్తోంది. ఈ లేటెస్ట్ పిక్స్ చూసిన తరువాత ఆమె అభిమానుల జాబితాలో మరింతమంది చేరిపోవడం ఖాయమేనని అనిపిస్తుంది.

Ashika ranganath
Actress
Naa Saamiranga
  • Loading...

More Telugu News