Budda Venkanna: దీని వెనుక ఉన్న బుజ్జి నానీలకు ఒకటే చెబుతున్నా!: బుద్ధా వెంకన్న

Budda Venkanna complains on fake post

  • సోషల్ మీడియాలో బుద్ధా పేరిట ఫేక్ పోస్టు వైరల్
  • ఇటీవల రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్
  • పొత్తుకు భంగం కలిగేలా పవన్ ప్రవర్తించడం తగదని బుద్ధా పేర్కొన్నట్టుగా పోస్టు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బుద్ధా

సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పవన్ కల్యాణ్ ఇటీవల రాజోలు, రాజానగరం స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించగా... పవన్ పౌడర్ వేసుకున్నవాడిలా ప్రవర్తించడం తగదని, పొత్తుకు భంగం కలిగే ఆస్కారం ఉందని గ్రహిస్తే మంచిదని, లేకపోతే నష్టపోయేది పవనే అని బుద్ధా వెంకన్న అన్నట్టుగా ఓ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపైనే బుద్ధా వెంకన్న మండిపడ్డారు.

"చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దమ్ము లేని దద్దమ్మలు నా పేరు మీద ఫేక్ పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వార్తలకు బుద్ధా వెంకన్న భయపడడు. దీని వెనుక ఉన్న బుజ్జి నానీలకు ఒకటే చెబుతున్నా... మీరంతా కలిసి నా ఈక కూడా పీకలేరు!" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాదు, ఫేక్ పోస్టులపై విజయవాడ పోలీస్ కమిషనర్ కు చేసిన ఫిర్యాదు ప్రతిని కూడా బుద్ధా వెంకన్న తన ట్వీట్ కు జత చేశారు.

Budda Venkanna
Fake Post
Pawan Kalyan
TDP
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News