Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో మూలాలు ఫిలిప్పీన్స్‌లో.. ఐపీ అడ్రస్ గుర్తింపు

Sachin Deepfake Video Posted from Philippines
  • సచిన్ ఓ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా వీడియో
  • ఆ యాప్ ద్వారా తన కుమార్తె డబ్బులు ఎలా సంపాదిస్తున్నదీ వివరించిన సచిన్
  • అది డీప్‌ఫేక్ వీడియో అంటూ సచిన్ పోస్ట్
  • టెక్నాలజీ దుర్వినియోగంపై టెండూల్కర్ ఆవేదన
ఇటీవల వైరల్ అయిన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియోను అప్‌లోడ్ చేసిన ఐపీ అడ్రస్‌ ఫిలిప్పీన్స్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వీడియోలో డబ్బును ఈజీగా ఎలా సంపాదించవచ్చో సచిన్ వివరించాడు. అంతేకాదు, ఆ గేమ్ ఆడుతూ తన కుమార్తె డబ్బులు ఎలా సంపాదిస్తున్నదీ పేర్కొన్నాడు. 

ఇదికాస్తా వైరల్ అయి విమర్శలు రావడంతో సచిన్ వెంటనే స్పందించాడు. అది తనది కాదని, డీప్‌ఫేక్ వీడియో అని స్పష్టం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు వీడియోను ఫిలిప్పీన్స్ నుంచి అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. వైరల్ అయిన తన డీప్‌ఫేక్ వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేస్తూ అది డీప్‌ఫేక్ వీడియో అని, టెక్నాలజి దుర్వినియోగం చూసి బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని అభిమానులను కోరుతూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ట్యాగ్ చేశాడు.  స్పందించిన మంత్రి డీప్‌ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
Sachin Tendulkar
Sachin Deepfake Video
Team India
Philippines
Deepfake

More Telugu News