Odisha: అందుబాటులో లేని అంబులెన్స్.. భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

Husband Carries Wife Dead Body For 20 KM

  • ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఘటన
  • ఆడబిడ్డకు జన్మనిచ్చాక అనారోగ్యంతో తల్లిగారింట్లో మహిళ కన్నుమూత
  • ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఫోన్
  • స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో మోసుకెళ్లిన భర్త

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడో భర్త. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాకెక్కి భర్త దయనీయ స్థితిని బయటపెట్టాయి. మృతురాలి భర్త అభి అమానత్య కథనం ప్రకారం.. ఆయన భార్య కరుణ (28) మూడు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కొరాపుట్ జిల్లాలోని తన పుట్టింట్లో ఉంటోంది. 

అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కరుణ మృతి చెందింది. అయితే, అంత్యక్రియలు మాత్రం తన ఇంటి వద్దే నిర్వహించాలని భావించిన భర్త మృతదేహాన్ని తన స్వగ్రామమైన నవరంగ్‌పూర్ జిల్లా నందహండి సమితి జగన్నాథ్‌పూర్ పంచాయతీలోని పుపుగావ్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. దీంతో అంబులెన్స్ కోసం మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన కరవైంది. మరో వాహనంలో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో నిన్న ఉదయం కరుణ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సాయంతో 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడు.

Odisha
Husband
Wife
Dead Body
  • Loading...

More Telugu News