Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు... పరుగులు తీసిన ప్రజలు

Tremors in Sangareddy distict

  • న్యాల్‌కల్, ముంగి తదితర గ్రామాల్లో స్వల్పంగా కంపించిన భూమి
  • తాము వింత శబ్ధాలు విన్నట్లుగా చెప్పిన ఆయా గ్రామాల ప్రజలు
  • భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్‌కల్, ముంగి తదితర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో పాటు తాము వింత వింత శబ్దాలు విన్నామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అయితే భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ప్రకంపనలపై అధికారులు ఆయా గ్రామాల్లో ఆరాతీస్తున్నారు.

Sangareddy District
earth quake
tremors
Telangana
  • Loading...

More Telugu News