Chandrababu: రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు: చంద్రబాబు

Chandrababu wishes voters on National Voters Day
  • నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
  • ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • ఓటు ఉన్నదీ, లేనిదీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచన
ఇవాళ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు హక్కు ఉన్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

"మీ భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం మీకు కల్పించిన అవకాశం ఓటు హక్కు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది, మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు. 

రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారు. మీ ఓటు తీసేస్తారు, లేదా మార్చేస్తారు. అప్రమత్తంగా ఉండండి. మీ ఓటు ఉన్నదీ, లేనిదీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోండి. ప్రజాస్వామ్యానికి మీ ఓటే పునాది. కాబట్టి ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
Chandrababu
National Voters Day
Voters
TDP
Andhra Pradesh

More Telugu News