Kurma Nayaki: 'కూర్మ నాయకి' నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్!

Kurma Nayaki Movie Update

  • 'కూర్మనాయకి' గా వరలక్ష్మి శరత్ కుమార్
  • దైవత్వం నేపథ్యంలో సాగే కథ 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న శివాజీ 
  • దర్శకత్వం వహిస్తున్న హర్ష కడియాల



ఈ మధ్య కాలంలో దైవత్వాన్ని జోడిస్తూ సాగే కథలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. కృష్ణుడి నేపథ్యంలో నడిచే 'కార్తికేయ 2' .. హనుమంతుడి నేపథ్యంలో సాగే 'హను మాన్' భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు విష్ణు తత్త్వం .. ఆయన లీలా విశేషంగా 'కూర్మనాయకి' సినిమా రూపొందుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమైన పాత్రలో కనిపించనుంది. 

కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి కొత్తగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అండాకారంలోని ఈ విశ్వాన్ని కూర్మ రూపంలో స్వామి మోస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ కథ అంతా కూడా వరలక్ష్మి శరత్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. ఇంతవరకూ తాను పోషిస్తూ వచ్చిన పాత్రలు ఒక ఎత్తు .. ఈ పాత్ర ఒక ఎత్తు అని ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. 

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రను శివాజీ పోషిస్తున్నాడు. శివాజీ కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. 'బిగ్ బాస్'లో నుంచి బయటికి వచ్చిన తరువాత, ఆయన మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడం విశేషం. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. విజిత్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్ష కడియాల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ - హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Kurma Nayaki
Varalakshmi Sharath Kumar
Shivaji
Harsha Kadiyala
  • Loading...

More Telugu News