Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ ను మట్టికరిపించిన భారత్
![India thrashes Bangladesh by 84 runs in Under 19 world cup](https://imgd.ap7am.com/thumbnail/cr-20240120tn65abf1c8a7f9c.jpg)
- దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్
- బ్లూంఫోంటీన్ లో భారత్ × బంగ్లాదేశ్
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసిన భారత్
- 45.5 ఓవర్లలో 167 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు గెలుపు బోణీ కొట్టింది. ఇవాళ బ్లూంఫోంటీన్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది. 252 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన బంగ్లాదేశ్ ను 45.5 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూల్చింది. భారత బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో రాణించాడు. ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ 1, అర్షిన్ కులకర్ణి 1, ప్రియాన్షు మోలియా 1 వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో అత్యధికంగా మహ్మద్ షిహాబ్ జేమ్స్ 54 పరుగులు చేయగా, ఆరిఫుల్ ఇస్లాం 41 పరుగులు సాధించాడు. అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది.