Banjara Hills: బంజారాహిల్స్ హోటల్ లో అగ్ని ప్రమాదం
![Fire accident in Banjara Hills](https://imgd.ap7am.com/thumbnail/cr-20240120tn65abbc3184c73.jpg)
- రోడ్డు నెంబర్ 4లోని హోటల్లో చెలరేగిన మంటలు
- పార్కింగ్‌లోని మూడు కార్లు కాలి బూడిద
- మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది
బంజారాహిల్స్‌లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ 4లోని ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని మూడు కార్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి.
గుంటూరులో అగ్ని ప్రమాదం
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిశాయి. పెద్ద మొత్తంలో పసుపు బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. తనకు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని యజమాని కన్నీరుమున్నీరు అయ్యారు.