Chiranjeevi: నా బయోగ్రఫీ రాసే బాధ్యతను ఈయనకు అప్పగిస్తున్నా: చిరంజీవి

Chiranjeevi asks Yandamuri Veerendranath to write his biography

  • సమకాలీన రచయితల్లో యండమూరికి ఎవరూ సాటి లేరన్న చిరంజీవి
  • ఎన్టీఆర్, ఏఎన్నార్ తనకు దైవ సమానులని వ్యాఖ్య
  • వారితో కలిసి నటించడం తన పూర్వ జన్మ సుకృతమన్న మెగాస్టార్

సమకాలీన రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ కి ఎవరూ సాటి లేరని మెగాస్టార్ చిరంజీవి కొనియాడాడు. యండమూరి రాసిన 'అభిలాష' నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాతోనే సినీ పరిశ్రమలో తన స్థానం సుస్థిరమయిందని చెప్పారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకు ఉండదని... అందుకే ఆ బాధ్యతను యండమూరికి అప్పగిస్తున్నానని తెలిపారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం జరిగింది. 

ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. యండమూరి నవలలు చదివితే యువతకు ఆలోచన, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీ పరిశ్రమకు రెండు కళ్లువంటి వారని అన్నారు. ఇద్దరూ తనకు దైవ సమానులని... తనకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని చెప్పారు. వారితో కలిసి నటించడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. వారితో తనకున్న అనుభవాలను మర్చిపోలేనని చెప్పారు.

  • Loading...

More Telugu News