Revanth Reddy: లండన్ లో సీఎం రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన యువతి.. వీడియో ఇదిగో!

Young lady gives flying kiss to Revanth Reddy

  • దావోస్ పర్యటన ముగించుకుని లండన్ లో పర్యటిస్తున్న రేవంత్
  • ఓ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన
  • రేవంత్ కు బొకే ఇచ్చి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన అమ్మాయి

దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సును ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. రేవంత్ లండన్ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో రేవంత్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో ఓ అమ్మాయి ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చింది. ఆ తర్వాత ఆనందంతో ఎగురుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇవ్వాలని చేయి చాచగా... ఆమె ఉత్సాహాన్ని చూసిన రేవంత్ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్ పై ప్రజలకు ఉన్న అభిమానం ఇది అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. రేవంత్ ఎక్కడకు వెళ్లినా ఆయన అభిమానులు ఉంటారని అంటున్నారు. 

మరోవైపు ఈ నెల 15 నుంచి 19 వరకు కొనసాగిన రేవంత్ దావోస్ పర్యటన విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణకు పెట్టుబడులను సాధించడంలో రేవంత్ టీమ్ సక్సెస్ అయింది. రాష్ట్రానికి రూ. 40,232 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

More Telugu News