Buddha Venkanna: 'కోవర్టు నాని' అంటూ కేశినేనిపై బుద్దా వెంకన్న కౌంటర్లు.. వీడియో ఇదిగో!

Buddha Venkanna Tweet On Kesineni Nani

  • కోవర్టువని తెలియక చంద్రబాబు గౌరవించారని వ్యాఖ్య
  • ఆ విషయం తెలుసు కాబట్టే జగన్ అగౌరవించాడంటూ వీడియో ట్వీట్
  • అప్పుడు.. ఇప్పుడు అంటూ సెటైరికల్ వీడియో పంచుకున్న బుద్దా వెంకన్న

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కేశినేని నానిపై బుద్దా వెంకన్న తాజాగా మరోమారు విమర్శలు గుప్పించారు. కేశినేని నాని కోవర్టు అని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ఆయన కోవర్టనే విషయం తెలియక టీడీపీ అధినేత చంద్రబాబు గౌరవించారని చెప్పారు. కోవర్టు అని తెలుసు కాబట్టే కేశినేని నానిని జగన్ అగౌరవించారని విమర్శించారు. ఈమేరకు శనివారం బుద్దా వెంకన్న ఓ వీడియో ట్వీట్ చేశారు.

అప్పుడు.. ఇప్పుడు అనే క్యాప్షన్ తో గతంలో కేశినేని నానిని చంద్రబాబు ఎలా మర్యాదగా చూసుకున్నారో వీడియోలో చూపించారు. సతీసమేతంగా ఆలయ దర్శనం తర్వాత చంద్రబాబు బయటకు వస్తుండగా కేశినేని నాని దూరంగా ఎక్కడో ఉండడం వీడియోలో కనిపించింది. అయితే, తన పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి కేశినేని నానిని చంద్రబాబు దగ్గరకు పిలిపించుకోవడం కనిపిస్తోంది. దూరంగా ఉన్న వ్యక్తిని పిలిపించుకుని చంద్రబాబు తన పక్కన చోటిచ్చి గౌరవించారని బుద్దా వెంకన్న చెప్పారు.

ప్రస్తుతం కేశినేని నానిని జగన్ అగౌరవించిన తీరును మరో వీడియోలో వెంకన్న చూపించారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కేశినేని నాని బొకే ఇచ్చి నమస్కరించడం, ఆ బొకేను ఎడమచేతితో అందుకుని వెంటనే పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత అక్కడే ఉన్న మరో నేతను జగన్ ఆప్యాయంగా తట్టడం కనిపించింది. ఇదీ కేశినేని నానికి జగన్ ఇచ్చిన మర్యాద అన్నట్లుగా బుద్దా వెంకన్న ఈ వీడియోను ట్వీట్ చేశారు.

Buddha Venkanna
Kesineni Nani
Tweet
TDP
YSRCP
Video Tweet
Chandrababu

More Telugu News