YSRCP: వైసీపీ నాలుగో జాబితా విడుదల.. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఔట్!

YSRCP candidates fourth list

  • చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి
  • ఒక ఎంపీ, 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు
  • సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు

వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో వైసీపీ నాయకత్వం మార్పులు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్టింగులకు టికెట్లను నిరాకరించగా... చాలా మందికి స్థానచలనం కలిగింది. తాజాగా నాలుగో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎస్పీ రిజర్వుడులో ఒక ఎంపీ అభ్యర్థిని, 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఐదుగురు సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. 

సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ లకు టికెట్లను నిరాకరించారు. డిప్యూటీ సీఎం, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నియమించారు.

వైసీపీ నాలుగో జాబితా:

YSRCP
MLA
MP
Candidates
Fourth List
  • Loading...

More Telugu News