Sri Vashishta: చరణ్ ప్రాజెక్టు గురించి నేను మాట్లాడలేదు.. అలా పుకారు లేపారంతే: డైరెక్టర్ శ్రీవశిష్ఠ

Sri Vashishta Interview

  • ఫాంటసీ ఇష్టమన్న శ్రీవశిష్ఠ
  • ఆ తరహా సినిమాలు ఎక్కువగా చూస్తానని వెల్లడి  
  • 'బింబిసార 2' తాను చేయడం లేదని స్పష్టీకరణ  
  • కల్యాణ్ రామ్ తో సాన్నిహిత్యం అలాగే ఉందన్న డైరెక్టర్


'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రీ వశిష్ఠ, ఆ సినిమాతో చాలామంది స్టార్ హీరోల చూపును తనవైపు తిప్పుకున్నాడు. ఫాంటసీ నేపథ్యంలో ఆయన ఆ సినిమాను తెరకెక్కించిన విధానాన్ని అంతా ప్రశంసించారు. తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ .. 'బింబిసార' సినిమాతో కల్యాణ్ రామ్ అవకాశం ఇవ్వడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. కాకపోతే సీక్వెల్ మాత్రం నేను చేయడం లేదు" అన్నారు. 

'బింబిసార 2' విషయానికి వచ్చేసరికి నా ఐడియాలజీ వేరేగా ఉంది. అంతలో నాకు మెగాస్టార్ ప్రాజెక్టు చేసే ఛాన్స్ కూడా వచ్చింది. అందువలన నేను కల్యాణ్ రామ్ గారి అనుమతి తీసుకునే బయటికి వచ్చాను. అంతే తప్ప మా మధ్య ఎలాంటి సమస్య రాలేదు. ఇక చిరంజీవిగారితో ఫాంటసీ మూవీ చేయాలని ఉందంటే, దానిని వేరేగా రాశారు" అని అన్నాడు. 

"చరణ్ తో నేను 'బాహుబలి' లాంటి సినిమా చేస్తానని అన్నట్టుగా కూడా చాలామంది రాసుకొచ్చారు. కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా ఆ మాట అనలేదు. కావాలని చెప్పి కొంతమంది అలా పుకారు పుట్టించారంతే. మొదటి నుంచి కూడా నాకు ఫాంటసీ కంటెంట్ అంటే ఇష్టం. అందువల్లనే అలాంటి కథతోనే సెట్స్ పైకి వెళ్లాను" అని చెప్పాడు.

Sri Vashishta
Choiranjeevi
Kalyan Ram
  • Loading...

More Telugu News