Telangana: పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth Reddy government transfers cases to ACB

  • గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అధికారులపై ఆరోపణలు
  • ఏడుకొండలు అనే రైతు ఫిర్యాదుతో గచ్చిబౌలిలో కేసు నమోదుచ
  • ఈ కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

నాంపల్లి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు సంబంధించి పశుసంవర్ధక శాఖపై ఓ కేసు, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపై మరో కేసు నమోదయ్యాయి. ఈ కేసులను ఇప్పుడు ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గొర్రెల పంపిణీపై ఏడుకొండలు అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 26న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఓ చోట 133 గొర్రెల యూనిట్లను పంపిణీ చేయగా... 18 మంది రైతులకు పశుసంవర్ధక శాఖ చెల్లింపులు జరపలేదు. గత ప్రభుత్వంలో అధికారులు బినామీ అకౌంట్ నెంబర్లకు నగదు బదిలీ చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి 406, 409, 420 ఐపీసీ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News