Sivaji: సుదీర్ఘ విరామం తర్వాత శివాజీ రీ ఎంట్రీ... 'కూర్మ నాయకి' చిత్రంలో కీలకపాత్ర

Actor Sivaji makes come back after long time

  • వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'కూర్మ నాయకి'
  • నేడు మోషన్ పోస్టర్ విడుదల
  • వీడియో షేర్ చేసిన శివాజీ

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'కూర్మ నాయకి'. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందరి కష్టాలు తీర్చే దేవుడికి ప్రజల వల్ల కష్టం వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర కథాంశం. 

అసలు విషయానికొస్తే ఈ చిత్రం ద్వారా నటుడు శివాజీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాన్నాళ్లుగా కెమెరా ముందుకు రాని శివాజీ... ఇటీవల బిగ్ బాస్ సీజన్-7 రియాలిటీ షోతో అందరినీ అలరించారు. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇన్నాళ్లకు 'కూర్మ నాయకి' చిత్రంతో వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ చిత్రంలో శివాజీ పాత్ర చాలా కీలకమైనదని తెలుస్తోంది. 

'కూర్మ నాయకి' చిత్రబృందం నేడు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్ వీడియోను శివాజీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూస్తారని సినిమాపై ఆసక్తి పెంచారు.

Sivaji
Re Entry
Kurma Nayaki
Varalakshmi Sarath Kumar
Tollywood

More Telugu News