Revanth Reddy: హలో లండన్: ప్రవాస భారతీయులకు రేవంత్ రెడ్డిని నేరుగా కలుసుకునే అవకాశం
- ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్
- జనవరి 19న సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రోగ్రాం
- హౌన్స్లో నగరంలోని హెస్ట్ హైడ్ హోటల్లో హలో లండన్
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హలో లండన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డితో హలో లండన్ ప్రోగ్రాంకు స్వాగతం అంటూ ట్వీట్ చేసింది. జనవరి 19వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హెస్ట్ హైడ్ హోటల్, నార్త్ హైడ్ లిన్, హౌన్స్లో నగరంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 19న శుక్రవారం రోజున రేవంత్ రెడ్డితో ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని... ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ను నేరుగా కలుసుకునే అవకాశం దక్కుతోందని తెలిపారు.