Team India: మొహాలీలో ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

Team India bowlers restricts Afghan batters

  • టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20
  • మొహాలీలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్ తో తొలి టీ20లో టీమిండియా బౌలర్లు రాణించారు. ఆఫ్ఘనిస్థాన్ ను ఆలౌట్ చేయకపోయినా, ఆ జట్టు భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేశారు. మొహాలీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఆఫ్ఘనిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. మహ్మద్  నబీ 27 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. మహ్మద్ నబీ 2 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. నజీబుల్లా జాద్రాన్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేయగా... రహ్మనుల్లా గుర్బాజ్ 23, కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ 25, అజ్మతుల్లా ఒమర్జాయ్ 29 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2, ముఖేశ్ కుమార్ 2, శివమ్ దూబే 1 వికెట్ తీశారు. 

అనంతరం, 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్  శర్మ (0) డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 1 వికెట్ కు 19 పరుగులు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 15, తిలక్ వర్మ 4 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News