Gabriel Attal: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 'గే'!
- ఫ్రాన్స్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఎలిజబెత్ బోర్న్
- నూతన ప్రధానిగా గాబ్రియెల్ అట్టల్ ను నియమించిన మేక్రాన్
- ఇప్పటివరకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న అట్టల్
ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవికి ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నూతన ప్రధానిని నియమించారు. ఇప్పటివరకు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించిన గాబ్రియెల్ అట్టల్ ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. 34 ఏళ్ల గాబ్రియెల్ అట్టల్ ఒక గే!
గాబ్రియెల్ అట్టల్ కరోనా సమయంలో ఎంతో చురుగ్గా వ్యవహరించడం మేక్రాన్ ను ఆకట్టుకుంది. ఫ్రాన్స్ ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా గాబ్రియల్ అట్టల్ నిలిచిపోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్ వస్తున్నాయి.
స్వలింగ సంపర్కులు కీలక పదవులు చేపట్టడం కొత్తేమీ కాదు. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ తాను గే అని బహిరంగంగా ప్రకటించి గతంలో సంచలనం సృష్టించారు. లియో వరాద్కర్ భారత సంతతికి చెందిన వ్యక్తి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా స్వలింగ సంపర్కుడు అంటూ గతంలో చాలా కథనాలు వచ్చాయి. ఆయన ఓసారి గే బార్ ను సందర్శించడం తీవ్ర చర్చనీయాంశం అయింది.