Venkatesh Daggubati: యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ ప్రధానంగా సంక్రాంతి సినిమాల సందడి!

- మాస్ యాక్షన్ మూవీగా 'గుంటూరు కారం'
- ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ గా 'సైంధవ్'
- రొమాంటిక్ ఫీల్ తో కూడిన యాక్షన్ తో 'నా సామిరంగ'
- డివోషనల్ టచ్ తో సాగే యాక్షన్ తో 'హను మాన్'
సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేయడమనేది ప్రతి యేటా ఉండేదే. అయితే ఈ సారి బలమైన స్టార్స్ రంగంలోకి దిగారు. 12వ తేదీన మహేశ్ బాబు 'గుంటూరు కారం' .. 13వ తేదీన వెంకటేశ్ 'సైంధవ్' .. 14వ తేదీన నాగార్జున 'నా సామిరంగ' థియేటర్లకు రానున్నాయి. ఈ ముగ్గురూ కూడా టాలీవుడ్ లో తిరుగులేని హీరోలే. ఈ స్థాయి సినిమాలు పోటీపడటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పాలేమో.

