Shakib Al Hasan: అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్

Bangladesh Cricket Star Shakib Al Hasan Slaps Fan
  • బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన షకీబ్
  • పోలింగ్ రోజున షకీబ్ ను చుట్టుముట్టిన అభిమానులు
  • వెనుక నుంచి పట్టుకున్న వ్యక్తిని కొట్టిన షకీబ్
తన అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన షకీబ్ ఒకటిన్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొన్ని గంటల ముందు ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల పోలింగ్ రోజున ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో ఓటు వేసి వస్తున్న షకీబ్ ను అభిమానులు చుట్టుముట్టారు. ఓ అభిమాని ఆయనను వెనుక నుంచి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో, సదరు అభిమాని చెంపను షకీబ్ ఛెళ్లుమనిపించాడు. ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ తరపున షకీబ్ పోటీ చేశారు.
Shakib Al Hasan
Bangladesh
Slap

More Telugu News