Heavy Rains: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం.. స్కూళ్లు, కాలేజీల బంద్

Heavy rain causes traffic jams holiday for schools and colleges

  • పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
  • నత్తనడకన సాగుతున్న ట్రాఫిక్
  • తమిళనాడులో మరోవారం పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ

చెన్నైలో ఈ ఉదయం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. భారీ వర్షం కారణంగా నాగపట్టణం, కిల్వేలర్ తాలూక, విల్లుపురం, కడలోర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, కల్లకురిచి, రాణిపేట, వెల్లూరు, తిరువణ్ణామలైలోనూ స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీళ్లు చేరడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

వచ్చే వారం రోజులు తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, మయిలదుతురై, నాగపట్టణం, తిరువూర్ జిల్లాలతోపాటు కరైకల్‌లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News