Nara Lokesh: మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేశ్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు

Nara Lokesh and family members offers prayers at Lakshmi Narasimha Swamy temple in Mangalagiri

  • మంగళగిరిలో వివిధ ఆలయాలను సందర్శించిన లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి 
  • లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు
  • మెట్లపూజ చేసిన లోకేశ్
  • రాజ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ 

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించారు. ఈ ఉద‌యం త‌ల్లి భువ‌నేశ్వ‌రి, భార్య బ్రాహ్మణి, త‌న‌యుడు దేవాన్ష్‌తో క‌లిసి నారా లోకేశ్ మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు. 

ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామివారికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. 

శివాలయంలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లుచేశారు. అనంత‌రం పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్లపూజ చేశారు. మెట్ల మార్గంలో వెళ్లి పానకాల స్వామిని దర్శించుకున్నారు. కొండ‌పైన ఉన్న‌ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. 

More Telugu News