Revanth Reddy: సేవకులం తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకున్నాం.. నెల రోజుల పాలనపై రేవంత్‌రెడ్డి

Telangana CM Revanth Reddy Shares About His One Month Rule

  • ఈ నెల రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్న రేవంత్‌రెడ్డి
  • అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందన్న సీఎం
  • నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందన్న రేవంత్

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. సంకెళ్లు తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్తానం తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన ఈ నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతి ఇచ్చిందని అన్నారు.  

పేదల గొంతు వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు చూస్తూ, రైతులకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు సాగుతోందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని వివరించారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇకపైనా తన బాధ్యత నిర్వర్తిస్తానని సుదీర్ఘ పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News