Revanth Reddy: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించను.. వారు స్టార్ట్ చేస్తే మాత్రం అందుకు అనుగుణంగా మా గేమ్ వుంటుంది!: రేవంత్ రెడ్డి

Revanth Reddy on leaders joining in other parties

  • మాకు పూర్తి మెజార్టీ ఉంది.. తప్పుడు మార్గాలను ఎంచుకోనని స్పష్టీకరణ
  • కేసీఆర్ ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లుగా వెల్లడి
  • కేసీఆర్ కొడుకు.. ఇతరులు ఫిరాయింపులపై దూకుడుగా వెళ్తే అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని వెల్లడి

తెలంగాణలో తమకు పూర్తి మెజారిటీ ఉందని... ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశ్యం తనకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తప్పుడు మార్గాలను ఎంచుకోవాలని తాను చూడటం లేదన్నారు. కానీ ప్రతిపక్షం ఫిరాయింపుల గేమ్ స్టార్ట్ చేస్తే మాత్రం అందుకు తిగిన విధంగా తమ గేమ్ మారుతుందని తేల్చి చెప్పారు. అయినా అలాంటి చర్య తెలంగాణలో జరగదని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పుకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒకవేళ కేసీఆర్ కొడుకు.. ఇతరులు ఫిరాయింపుల అంశంపై దూకుడుగా వెళ్తే... రంగస్థలం తయారు చేస్తే అందుకు అనుగుణంగా తాము ముందుకు సాగుతామన్నారు. కేసీఆర్‌కు.. ఆయన కుటుంబానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తాను ముఖ్యమంత్రినై ముప్పై రోజులు అయిందన్నారు. తాను ఇప్పటి వరకు బ్యాలెన్స్‌గానే ఉన్నానని... ఇక ముందు కూడా అలాగే వ్యవహరిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారు మా నెత్తిన పాలు పోసినట్లే అన్నారు.

  • Loading...

More Telugu News