Captain Miller: ధనుష్ హీరోగా 'కెప్టెన్ మిల్లర్'... థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Trailer released Dhanush Captain Miller

  • ధనుష్ హీరోగా 'కెప్టెన్ మిల్లర్'
  • అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో చిత్రం
  • జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్

తమిళ కథానాయకుడు ధనుష్ కొత్త చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. కెప్టెన్ మిల్లర్ చిత్రం జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే, ఇది బ్రిటీష్ కాలం నాటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని అర్థమవుతోంది. కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News