Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ప్లాట్ లో సనాతన ధర్మ పాఠశాల

Sanatan Dharma pathshala in Dawood Ibrahims plot
  • అండర్ వరల్డ్ డాన్ ప్లాట్ ను వేలంలో సొంతం చేసుకున్న లాయర్
  • రూ.15 వేలు కనీస ధరగా నిర్ణయించిన ప్లాట్ కు రూ. 2 కోట్లు
  • మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దావూద్ పూర్వీకుల ఆస్తుల వేలం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఆస్తి వేలంలో ఊహించని ధర పలికింది. కనీస ధర రూ.15 వేలుగా నిర్ణయించగా.. ఏకంగా రూ.2 కోట్లకు అమ్ముడుపోయింది. దావూద్ ఇబ్రహీంకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఆస్తులకు ఓ లాయర్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ పూర్వీకులు ఉండేవారు. గ్రామంలో ఓ ప్లాట్ తో పాటు ఆయనకు నాలుగు రకాల ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ముంబైలో వివిధ నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

పలు క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో దావూద్ కు చెందిన వివిధ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబాకే లోని నాలుగు ఆస్తులను 2020లో వేలం వేసింది. ఇందులో పాల్గొన్న ఓ లాయర్.. రూ.2.01 కోట్లు వెచ్చించి వాటిని సొంతం చేసుకున్నాడు. దావూద్ ఇబ్రహీంకు చెందిన ప్లాట్ ను సొంతం చేసుకున్న లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ ప్లాట్ ను పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, దావూద్ ఆస్తులను సొంతం చేసుకున్న లాయర్ ఎవరనే వివరాలు మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఢిల్లీకి చెందిన లాయర్ అని వేలంలో పాల్గొన్న వారు చెప్పినట్లు సమాచారం.
Dawood Ibrahim
plot
Sanatan Dharma pathshala
Ratnagiri
Maharashtra
Dawood plot

More Telugu News