KTR: ఆ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోంది... నిరసన చేపట్టండి: కేటీఆర్ పిలుపు

KTR blames congress government over schemes

  • గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాలను రద్దు చేసే కుట్ర చేస్తోందని విమర్శ
  • ప్రజలకు లబ్ది కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు
  • ఈ పథకాలు రద్దు చేయడమంటే బలహీనవర్గాలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్య

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి ప్రజలకు లబ్ది చేకూర్చే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లు, ముఖ్య నేతలతో కేటీఆర్, హరీశ్ రావులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్రజలకు లబ్ది కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ప్రజలకు లబ్ది కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలను రద్దు చేయకుండా లబ్దిదారుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. దళితబంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడమంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లే అని మండిపడ్డారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News