Thandel: మా 'తండేల్' రాజుకు ఇలాంటివి ఓ లెక్కా?: గీతా ఆర్ట్స్

Geetha Arts says Essence of Thandel will be released tomorrow

  • నాగచైతన్య హీరోగా తండేల్
  • మత్స్యకారుడి పాత్ర పోషిస్తున్న నాగచైతన్య
  • నేడు గ్లింప్స్ విడుదల చేయాలని భావించిన చిత్రబృందం
  • రేపటికి వాయిదా

అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా టైటిల్ తోనే ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేసింది. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య పేరు తండేల్ రాజు. నాగచైతన్య  ఓ మత్స్యకారుడిగా కనిపిస్తున్న స్టిల్స్ ఇప్పటికే భారీ హైప్ తెచ్చిపెట్టాయి. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

కాగా, తండేల్ చిత్రబృందం నాగచైతన్య పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను ఇవాళ విడుదల చేయాలని భావించింది. అయితే, అనుకోని కారణాల వల్ల ఈ గ్లింప్స్ రిలీజ్ రేపటికి వాయిదా పడింది. ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరిట రూపొందించిన స్టన్నింగ్ గ్లింప్స్ రేపు విడుదల చేస్తున్నామని గీతా ఆర్ట్స్ వెల్లడించింది. 

"మహాసముద్రం అంతుచిక్కని రీతిలో అనిశ్చితికి మారుపేరులా ఉంటుంది. దారితెన్నూ తెలియని సముద్ర జలాలు, ఎటునుంచి ప్రమాదం పోటెత్తుతుందో తెలియని పరిస్థితులు... ఇవన్నీ మా తండేల్ రాజుకు ఓ లెక్కా? ఇలాంటి కష్టాలను అవలీలగా అధిగమిస్తాడు... అన్నింటినీ శాసిస్తాడు" అంటూ తండేల్ రాజు హీరోయిజాన్ని వివరించింది. 'ఎసెన్స్ ఆఫ్ తండేల్' రేపు తీరాన్ని తాకనుంది అంటూ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

More Telugu News