Ambati Rambabu: రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి అంబటికి చేదు అనుభవం

AP Minister Ambati Rambabu faces ire in Muppalla
  • పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి పర్యటన
  • మంత్రిని అడ్డుకున్న మృతుడి బంధువులు
  • ఇప్పుడా పరామర్శకు వచ్చేది అంటూ ఆగ్రహం
  • చెప్పులతో కొట్టాలి అంటూ వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి అంబటి రాంబాబు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ముప్పాళ్ల వెళ్లారు. అయితే, మృతుడి బంధువుల నుంచి మంత్రికి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రోడ్డు ప్రమాదం జరిగింది ఎప్పుడు? మంత్రి వచ్చేది ఇప్పుడా? అంటూ వారు మండిపడ్డారు. 

ముప్పాళ్లలో మేం లేకపోతే వైసీపీ లేదు... మేం వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాం... ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు... మంత్రి ఇప్పుడెందుకు వచ్చాడు? ఇప్పుడు చచ్చిన తర్వాత వచ్చాడా? అంటూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.

 ఈసారి వస్తే చెప్పులతో కొట్టాలి అంటూ ఓ వ్యక్తి మంత్రి అంబటిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇది జరుతుండగానే గుంపులోంచి ఒకరు బూతులతో విరుచుకుపడ్డారు. కాగా, మృతుడి బంధువులకు సర్దిచెప్పేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోకపోవడంతో మంత్రి అంబటి అక్కడ్నించి నిష్క్రమించారు.
Ambati Rambabu
Muppalla
Palnadu District
YSRCP
Andhra Pradesh

More Telugu News