Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి జాన్వీకపూర్

Bollywood Actress Janhvi Kapoor Visits Tirumala
  • నటి మహేశ్వరితో కలిసి బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం
  • ఆహ్వానం పలికిన టీటీడీ అధికారులు
  • దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీకపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మరో నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు.

దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం  చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందేశారు. ఈ సందర్భంగా జాన్వీకపూర్‌ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. కాగా, జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు.
Janhvi Kapoor
Bollywood
Maheshwari
Devara
Tirumala

More Telugu News